సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి
సరైన పత్రాలు లేని 52వాహనాలు, 18.65లీటర్ల మద్యం స్వాధీనం
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్ టూబీహెచ్‌కే కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..గంజాయి విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పత్రాలు లేని 49 బైక్‌లు, 3ఆటోలు సీజ్ చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి, వారి నుంచి 18.65 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర, సురక్ష నేత్ర, షీ సేఫ్ వంటి సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, విద్యాసాగర్, రాజేశ్, 14మంది ఎస్‌ఐలు, వంద మంది పోలీసులు పాల్గొన్నారు.


