స్నేహబంధం మరింత బలోపేతం | - | Sakshi
Sakshi News home page

స్నేహబంధం మరింత బలోపేతం

Aug 2 2026 7:32 AM | Updated on Aug 2 2026 7:32 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో స్నేహితుల దినోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే పాఠశాలల్లో విద్యార్థులు స్నేహితులకు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పరస్పరం మిఠాయిలు పంచిపెట్టుకొని స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. శ్రీవాణి పాఠశాలలో జరిగిన స్నేహితుల దినోత్సవంలో బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌ అసోసియేషన్‌ తెలంగాణ (బీస్మాట్‌) జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొని మాట్లాడారు. స్నేహం అనేది మనిషి జీవితంలో అత్యంత విలువైన బంధమన్నారు. ఆపదలో అండగా నిలిచి, ఆనందంలో భాగస్వామిగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏర్పడే మంచి స్నేహాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయన్నారు. ప్రతి విద్యార్థి మంచి స్నేహితుడిగా ఎదిగి సమాజంలో ఆదర్శప్రాయంగా నిలవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement