అక్కన్నపేట(హుస్నాబాద్): ద్విచక్రవాహనాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని కట్కూర్ గ్రామానికి చెందిన గొల్లెన సురేశ్ కొన్ని రోజులుగా గ్రామంలో పలువురి ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లాడు. అలాగే మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకొని అతడ్ని విచారించగా నేరం అంగీకరించాడు. కాగా నిందితుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. తరిగొప్పుల పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ చోరీకి సంబంధించిన కేసులో గతంలో రిమాండ్ అయినట్లు తెలిపారు.


