పేదింటి పెద్ద బాపు కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

పేదింటి పెద్ద బాపు కేసీఆర్‌

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

● ఆడబిడ్డల వివాహాలకు

‘కల్యాణలక్ష్మి’తో ఆర్థిక భరోసా

పటాన్‌చెరు: ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని అందించి, పెద్ద కొడుకులా, మేనమామలా అండగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉ దయం పటాన్‌ చెరు డివిజన్‌ పరిధిలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి..పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన మహోన్నత నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కల్యాణ లక్ష్మి అదనంగా తులం బంగారం అందించలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆదర్శ్‌ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement