నాణ్యమైన విద్య.. మెరుగైన వసతి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య.. మెరుగైన వసతి

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

● రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో భద్రతకు పెద్దపీట

● కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లతో ఆ యన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గదు ల్లో తగిన గాలి, వెలుతురు ఉండేలా చూడాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు సదుపాయాలకు సంబంధించి పూర్తి వివరాలతో అంచనా ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ప్రిన్సిపాళ్లు, జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేశ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement