ఏడీఏ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఏడీఏ బాధ్యతల స్వీకరణ

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

ఏడీఏ బాధ్యతల స్వీకరణ మెరుగైన వైద్య సేవలు అందించాలి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సన్మానం ఆయిల్‌ పామ్‌ సాగుతో అధిక లాభాలు

నారాయణఖేడ్‌: ఖేడ్‌ డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకుడిగా నాగల్‌గిద్ద మండల వ్యవసాయ అధికారి ప్రవీన్‌చారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు ఆయన శనివారం ఏడీఏగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, సలహాలను అందిస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. డివిజన్‌ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులు ఆయనను అభినందించారు.

నారాయణఖేడ్‌: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌) శ్రీధర్‌ వైద్యులు, సిబ్బందిని ఆ దేశించారు. ఖేడ్‌ ప్రాంతీయ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలతో పాటు రోగుల వార్డులు, ప్రయోగశాల, రోగులకు అందిస్తున్న వైద్యం, ఆహారం, సిబ్బంది హాజరు పట్టిక, ఇతర రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిని మరోసారి సందర్శిస్తానని తెలిపారు. ఆయనవెంట ఆర్‌ఎంఓ డాక్టర్‌ వికాస్‌, శ్రీకాంత్‌ ఉన్నారు.

సంగారెడ్డి జోన్‌: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోలీస్‌ డ్యూటీ మీట్‌ క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సన్మానించారు. ఐదవ తెలంగాణ బ్యాడ్మింటన్‌ లో హెడ్‌ కానిస్టేబుల్‌ సజీవ్‌ బంగారు పతకం సాధించగా మహిళా విభాగంలో శ్రావ్య, ధరణిలో కాంస్య పతకం సాధించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వారిని శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ నరేందర్‌ పాల్గొన్నారు.

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): తక్కువ పెట్టుబడితో అధిక లాభాలనిచ్చే ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వర్‌ రావు అన్నారు. మండల పరిధిలోని శంశల్లాపూర్‌లో రైతులు సాగు చేసిన ఆయిల్‌ పామ్‌ పంటలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగును పెంచేందుకు అవరమైన పనిముట్లు, విత్తనంను సబ్సీడిపై అందిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ పంట సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోందన్నారు. ఒక్క సారి పంటను సాగు చేసుకుంటే 30 ఏళ్లు వరకు దిగుబడులు వస్తాయన్నారు. టన్నుకు రూ.24వేలు ధర ఉందని, ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ.లక్షలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఆయన వెంట పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement