సామూహిక వ్రతం ఆచరిస్తున్న మహిళలు
ఫసల్‌వాడిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సుమారు 2,700 మంది మహిళలతో ఆరుద్రాష్టమి వ్రతాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతంతో విద్యాపీఠంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగేరి శ్రీహరి, జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి
బల్దియా భూములపై నజర్!
క్యాసారం.. కన్నీటిసంద్రం


