వ్యక్తి ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అలకుంట గురువయ్య(50) శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ మేరకు తన భార్య అలకుంట రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనారోగ్యంతో రైతు..
చేర్యాల(సిద్దిపేట): అనారోగ్యంతో మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఆకునూరులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడుదూరి రాములు(64) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ అపూర్వరెడ్డి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


