సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి
పటాన్‌చెరు: ప్రతీ లక్ష్యాన్ని నిబద్ధతతో సాధించాలని సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ 17వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 1,990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం భారతీయ చేనేత రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ చేనేత కళాకారుడు గజం గోవర్ధన్‌కు గీతం గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. అలాగే విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి లక్ష్యాన్ని నిబద్ధతతో సాధించాలని, జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గీతం అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. లక్ష్యాలపై నిబద్ధత, నిరంతరం నేర్చుకోవడం విజయానికి సూత్రాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


