గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని.. ఒక్కసారిగా భీమ్లానాయక్‌.. | - | Sakshi
Sakshi News home page

గొంతులో చికెన్‌ ముక్క ఇరుక్కొని.. ఒక్కసారిగా భీమ్లానాయక్‌..

Oct 14 2023 5:00 AM | Updated on Oct 14 2023 8:31 AM

- - Sakshi

సంగారెడ్డి: మద్యం మత్తులో పచ్చి చికెన్‌ తినడంతో గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి నవాబుపేట పంచాయతీ రాములు తండాలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నుర మండలం కొత్తగూడం తండాకు చెందిన భీమ్లానాయక్‌(40) నాలుగు నెలల నుంచి రాములు తండాలోని అత్తగారి ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

దసరా సెలవులు కావడంతో భీమ్లానాయక్‌ ఇద్దరు కూతుళ్లు గురువారం హాస్టల్‌ నుంచి తండాకు వచ్చారు. వారి కోసం తెచ్చి ఉంచిన మాంసాన్ని మద్యం మత్తులో ఉన్న భీమ్లానాయక్‌ తిన్నాడు. దీంతో చికెన్‌ ముక్కలు గొంతులో ఇరుక్కోవడంతో కుటుంబ సభ్యులు నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికాంత్‌రావ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement