లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పసికందును ఎత్తుకుని వంతెనపైకి వచ్చిన ఒక తండ్రి, సెల్ఫీ తీసుకునే నెపంతో కన్న కూతురిని యమునా నదిలోకి విసిసేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర ప్రాంతంలో ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెతో కలిసి వంతెనపైకి వచ్చాడు. అక్కడ సెల్ఫీ దిగేందుకు కొద్దిసేపు ఆగాడు. అయితే, చుట్టూ ఎవరూ గమనించని సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ, ఆ పసికందును ప్రవహిస్తున్న యమునా నదిలోకి విసిసేశాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గాలింపు జరిపి నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగానే అతను ఈ అరాచకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి జాడ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. కనికరం లేకుండా పసిబిడ్డను బలిగొన్న తండ్రి దుర్మార్గపు బుద్ధిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.


