మా కొడుకును బతికించరూ..! | - | Sakshi
Sakshi News home page

మా కొడుకును బతికించరూ..!

Jul 27 2023 8:16 AM | Updated on Jul 27 2023 2:27 PM

- - Sakshi

సంగారెడ్డి: మా కొడుకును బతికించరూ అంటూ బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన సుభాష్‌, మంజుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన సుభాష్‌, మంజుల కుమారుడు రోహిత్‌ (27) పరిశ్రమలో విధులు ముగించుకొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోహిత్‌ చికిత్స పొందుతున్నాడు. రోహిత్‌ బ్రెయిన్‌ ఆపరేషన్‌ కోసం రూ.8లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అప్పులు చేసి రూ. 4లక్షలు ఆపరేషన్‌ కోసం తల్లిదండ్రులు ఆస్పత్రిలో చెల్లించారు. మరో రూ.4లక్షలు అవసరం కాగా సాయం చేయాలనుకునే దాతలు 9666 493043 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. బొల్లారంలోని బీజేపీ నేత ఆనంద్‌కృష్ణారెడ్డి రూ.10వేల సాయాన్ని అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement