మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: నేటి మొక్కలే రేపటి మహావృక్షాలని, నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించాలని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భావితరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతీ వ్యక్తి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఎదిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వన మహోత్సవాన్ని నిర్వహించి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, సీఐలు మహేశ్, జార్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌ఐలు శైలందర్, రామకృష్ణ పాల్గొన్నారు.


