చిన్నశంకరంపేట(మెదక్): మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని భాగీర్థిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ విఠల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండకాడి రాజు(40) మేసీ్త్ర పనులు చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో మద్యానికి అలవాటు పడటంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కాగా మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య విజయ భర్తను మందలించింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిన అతడు పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


