అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌లో సిద్దిపేట అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు మంగళవారం బెజ్జంకి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీల కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వ్యవసాయ భూములు పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, డీఎస్పీ నాయకులు మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్, మహేందర్‌రెడ్డి, రూపేశ్, శ్రీనివాస్, సురేశ్, శేఖర్‌బాబు, సాయిక్రిష్ణ పాల్గొన్నారు.


