ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన సబిత.. మంత్రిగా ఘనత.!

- - Sakshi

అమాత్య పదవుల్లో సరికొత్త రికార్డు!

భర్త మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి..

కేఎల్‌ఆర్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగు!

సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల చెల్లెమ్మగా.. తొలి మహిళా హోం మంత్రిగా... గెలిచిన ప్రతీసారి మంత్రి పదవి చేపట్టి ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ప్రత్యేకంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె మహేశ్వరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి. భర్త మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

► ఉమ్మడి రాష్ట్రంలో 1999లో సబితారెడ్డి భర్త పి.ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఎల్‌ఆర్‌పై విజయం సాధించారు. 2000లో ఆయన అకాల మరణంతో ఆమె అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆమె కేఎల్‌ఆర్‌ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టింది.
► 2004లోనూ పోటీలో నిలిచిన ఆమె టీడీపీ అభ్యర్థి ఎస్‌.భూపల్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఆమె మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని గనుల శాఖ మంత్రిగా మెప్పించారు.
► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితారెడ్డి మూడోసారి బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్‌ఆర్‌ ప్రోత్సహించి ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టడంతో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అనంతరం 2014 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు.
► 2018 ఎన్నికల్లో మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేసిన సబితారెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆమె గులాబీ తీర్థం పుచ్చుకుని సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా రికార్డుల నెలకొలిపారు. 2023 ఎన్నికల్లో ఆమె కారుగుర్తుపై ఎన్నికల పోటీలో ఉన్నారు.
ఇవి చదవండి: ‘పట్నం’లో టైట్‌ ఫైట్‌! కాంగ్రెస్‌ నలభై ఏళ్ల కల.. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కోసం వల!

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-11-2023
Nov 15, 2023, 11:19 IST
జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి...
15-11-2023
Nov 15, 2023, 11:17 IST
కథలాపూర్‌(వేములవాడ): ఎదుటి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు.. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు...
15-11-2023
Nov 15, 2023, 08:18 IST
మహబూబ్‌నగర్‌: జిల్లాలోని ఓటర్లకు బుధవారం నుంచి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్‌...
15-11-2023
Nov 15, 2023, 07:41 IST
హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన ఒక వ్యూహకర్త ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు అవకాశాలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం...
15-11-2023
Nov 15, 2023, 07:19 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దాదాపు రెండు వారాలు మాత్రమే గడువుంది. ఈలోగా విస్తృత ప్రచారానికి అధికార బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది....
15-11-2023
Nov 15, 2023, 07:15 IST
హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని ఈఆర్‌ఓల నుంచి బూత్‌ లెవల్‌ అధికారుల వరకు ఓటరు జాబితాలను పరిశీలన చేశారా? లేదా? అనే సందేహాలు...
15-11-2023
Nov 15, 2023, 05:50 IST
చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ...
15-11-2023
Nov 15, 2023, 05:41 IST
సాక్షి, వరంగల్‌/జనగామ/ సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి...
15-11-2023
Nov 15, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు....
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెబెల్స్‌ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు...
15-11-2023
Nov 15, 2023, 05:14 IST
వికారాబాద్‌: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ మామకు మద్దతిద్దాం.. ఆర్‌ఎస్‌ఎస్‌ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో...
15-11-2023
Nov 15, 2023, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ...
15-11-2023
Nov 15, 2023, 04:02 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, మహబూబాబాద్‌/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుండా.....
15-11-2023
Nov 15, 2023, 00:42 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఆర్మూర్‌ నియోజకవర్గంలో గోర్త రా...
14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం.. 
14-11-2023
Nov 14, 2023, 15:16 IST
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని..
14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం... 

Read also in:
Back to Top