శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి
మీర్‌పేట: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్‌పాషా పిలుపునిచ్చారు. లెనిన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారితో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సంపూర్ణ స్వాతంత్య్రం కోసం 1925లో ఏర్పడిన పార్టీ నాటి నుంచి నేటివరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించిందని, లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచి వేలాది గ్రామాలను విముక్తి చేసిందన్నారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ బాలాపూర్ మండల కార్యదర్శి ముకుందంగారి చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి యాదయ్య యాదవ్ పాల్గొన్నారు.


