ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి
● ధ్యానగురువు స్వర్ణమాల పత్రి
● ఆరో రోజుకు చేరిన వేడుకలు
కడ్తాల్: అందరినీ ప్రేమగా చూడటమే పిరిమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ (పీఎస్‌ఎస్‌ఎం) లక్ష్యమని ధ్యానగురువు స్వర్ణమాల పత్రి అన్నారు. మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో జరుగుతున్న పత్రీజి ధ్యాన మహాయాగాలు శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణమాల పత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మర్షీ పత్రీజీ మన వెనుకాల ఉండి ధ్యానులందరినీ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ధ్యాన గురువు పరిణిత పత్రి మాట్లాడుతూ.. పత్రీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో పిరిమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.


