కొహెడను డివిజన్‌గా ప్రకటించాలని వినతి
తుర్కయంజాల్: కొహెడను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ కొహెడకు చెందిన అఖిలపక్ష నాయకులు శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 1956లోనే మేజర్ పంచాయతీగా అవతరించిన కొహెడ జీహెచ్‌ఎంసీలో విలీనంతో ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వం సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న పండ్ల మార్కెట్, 13 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న చేపల మార్కెట్ తమ గ్రామం పరిధిలోకి వస్తాయని గుర్తుచేశారు. సుమారు 1,200కు పైగా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయన్నారు. పెద్ద అంబర్‌పేటను 52వ డివిజన్‌గా ఏర్పాటు చేసినందున 53వ డివిజన్‌గా కొహెడను చేయాలని కోరారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానెం అర్జున్ గౌడ్, రైతు సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, నాయకులు కందాల బిందు రంగారెడ్డి, మూల రవి గౌడ్, కందాల బల్‌దేవ్ రెడ్డి పాల్గొన్నారు.


