శంషాబాద్ జోన్‌లోకి.. శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం
● దేశంలోనే అతిపెద్ద నగర కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ
● 300 వార్డులతో మొదటి స్థానం..
ద్వితీయ స్థానంలో ఢిల్లీ
● పాలన సౌలభ్యం.. ప్రజలకు సౌకర్యాలు పెరిగే అవకాశం
బిగ్ సిటీ
కూకట్‌పల్లి జోన్
సికింద్రాబాద్ జోన్
శేరిలింగంపల్లి జోన్
నగర పాలనలో నూతన దిశ..
సిటీ ‘ఫేస్’ మారింది
డీలిమిటేషన్‌తో హైదరాబాద్ ముఖచిత్రం మారింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా సిటీ చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వరకు 150 వార్డులతో (డివిజన్లతో) ఉన్న కార్పొరేషన్ ఏకంగా 300 వార్డులకు పెరిగింది. ఈ విస్తరణ వల్ల ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రజలకు పాలన చేరువ కానుందా? మౌలిక సదుపాయాలు మెరుగవుతాయా ? అన్నది భవిష్యత్‌లో వెల్లడి కానుంది.
అత్యధిక వార్డులున్న మున్సిపల్ కార్పొరేషన్‌గా..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 300 వార్డుల(డివిజన్ల)తో దేశంలోనే అత్యధిక వార్డులున్న మహా నగరంగా మారింది.
– బీఎంసీ, ఎంసీడీ, బీబీఎంపీల్లో 200కు పైగా వార్డులున్నప్పటికీ, 300 వార్డులున్న మహానగరం మాత్రం హైదరాబాదే కావడం విశేషం.
సాక్షి, సిటీబ్యూరో
శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంతో హైదరాబాద్ బృహత్ నగరంగా మారిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయాల్లో రాజేంద్రనగర్, గోల్కొండ జోనల్ ఆఫీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విలీనంతో నగర విస్తీర్ణం 650 చదరపు కిలో మీటర్ల నుండి 2053 చదరపు కిలో మీటర్లకు విస్తరించిందన్నారు. విస్తీర్ణం పెరగడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ వార్డులను 150 నుండి 300కు పెంచిందన్నారు. జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచడం జరిగిందని చెప్పారు. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లు కొత్త జోన్లుగా ఏర్పాటయ్యాయన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల పెంపుతో పౌరసేవలు సులభంగా, వేగంగా అందుతాయన్నారు. మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
కొత్త బాధ్యతలు..
జీహెచ్‌ఎంసీలో ఉన్న ఆరు జోన్లకు తోడు అదనంగా మరో ఆరు జోన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం..కొత్త జోన్లకు కమిషనర్లను కూడా వెంటనే నియమించింది. గురు, శుక్రవారాలు సెలవురోజులైనప్పటికీ, డీలిమిటేషన్ తుదినివేదిక, జోనల్ కమిషనర్ల నియామకాలు, వారు బాధ్యతలు స్వీకరించడాలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ కొత్త స్వరూపం కావడంతో ఇప్పటికే జోనల్ కమిషనర్లుగా ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా తమ జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ (జడ్‌సీ)గా అనురాగ్‌జయంతి, గోల్కొండ జడ్‌సీగా జి.ముకుంద్‌రెడ్డి, చార్మినార్ జడ్‌సీగా ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, కూకట్‌పల్లి జడ్‌సీగా అపూర్వ్ చౌహాన్, శంషాబాద్ జడ్‌సీగా కె.చంద్రకళ, ఉప్పల్ జడ్‌సీగా రాధికాగుప్తా, సికింద్రాబాద్ జడ్‌సీగా ఎన్.రవికిరణ్, ఖైరతాబాద్ జడ్‌సీగా ఆల ప్రియాంక, మల్కాజిగిరి జడ్‌సీగా సంచిత్ గంగ్వార్, శేరిలింగంపల్లి జడ్‌సీగా బోర్కడే హేమంత్ సహదేవ్‌రావ్, కుత్బుల్లాపూర్ జడ్‌సీగా సందీప్‌కుమార్‌ఝా, ఎల్‌బీనగర్ జడ్‌సీగా హేమంత్ కేశవ్‌పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త జడ్‌సీలకు కమిషనర్ కర్ణన్ అభినందనలు తెలిపారు. విధుల నిర్వహణలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
దేశంలోని ప్రధాన నగరాలు, అక్కడి మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులిలా ..
నగరం మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు
హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 300
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) 250
ముంబై బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 227
బెంగళూరు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) 225
చైన్నె గ్రేటర్ చెన్నయ్ కార్పొరేషన్ 200
పుణే పుణే మున్సిపల్ కార్పొరేషన్ 162
కోల్‌కతా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 144
అహ్మదాబాద్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 48
సమగ్ర ప్రణాళికలు, మెరుగైన పౌర సేవలు
జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరించిన కారణంగా.. సరిపడా భూ లభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం లభించింది. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ నిధులు, సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి రానున్నాయి. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు అందనున్నాయి.
వేగంగా పౌరసేవలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు
శంషాబాద్ జోన్‌లోకి.. శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం
శంషాబాద్ జోన్‌లోకి.. శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం
శంషాబాద్ జోన్‌లోకి.. శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం
శంషాబాద్ జోన్‌లోకి.. శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం


