సిరిసిల్లటౌన్: అంబేడ్కర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై జిల్లా కేంద్రంలో శుక్రవారం సంబరాలు చేశారు. దళిత, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాసు, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, జిల్లా అధ్యక్షుడు తుంగ శివరాజు, నేదూరి లక్ష్మణ్, నక్క నర్సయ్య, సిరిగిరి కిశోర్, లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
హమార ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం
ముస్తాబాద్(సిరిసిల్ల): అంబేడ్కర్‌ను అవమానిస్తూ రచనలు చేసిన హమార ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకుడు అంకని భాను కోరారు. మండలంలోని తుర్కపల్లిలో హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుర్గాప్రసాద్, దేవదాస్, ఎల్లం ఉన్నారు.


