ఆర్టీసీలో ఎన్నికల సైరన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఎన్నికల సైరన్‌

Sep 22 2026 12:18 AM | Updated on Sep 22 2026 12:18 AM

● సన్నద్ధమైన యూనియన్లు ● కూటములతో కొత్త సమీకరణలు ● టీఎంయూ పోటీపై అనిశ్చితి ● 11 డిపోలు.. 2,830 మంది ఓటర్లు

కరీంనగర్‌టౌన్‌: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవడంతో కార్మిక సంఘాల్లో సంద డి మొదలైంది. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని 11 డిపోల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఒకవైపు టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొనగా.. మరోవైపు యూనియన్ల మధ్య పొత్తులు, కూటములు కొత్త స మీకరణాలకు తెరతీస్తున్నాయి. గత ఎన్నికలతో పో లిస్తే ఈసారి పోరు ఆసక్తికరంగా మారే అవకాశముంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు యూని యన్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరి కి ఏ సంఘానికి కార్మికుల మద్దతు లభిస్తుందన్నది అక్టోబర్‌ 17న వెలువడే ఫలితాలతో తేలనుంది.

2,830 మంది ఓటర్లు

కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో కరీంనగర్‌–1, కరీంనగర్‌–2, హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, మంథని, గోదావరిఖని, సిరిసిల్ల డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,830 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 376 మంది మెయింటెనెన్స్‌ సిబ్బంది, 132 మంది ఎగ్జిక్యూటీవ్‌ సిబ్బంది, 19 మంది రీజియన్‌ కార్యాలయ ఉద్యోగులు, నలుగురు మెడికల్‌, ముగ్గురు ఫైనాన్స్‌, ఒకరు స్టోర్‌ విభాగానికి చెందిన వారు ఉన్నారు.

టీఎంయూ దారెటు?

2016లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) విజయం సాధించింది. ఈసారి ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోవడం, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల్లో టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొంది. లేబర్‌ కమిషన్‌ నుంచి అనుమతి విషయంలోనూ సమస్యలు ఎదురయ్యా యి. రీజియన్‌లో బలమైన సభ్యత్వం ఉన్న టీఎంయూ పోటీకి దూరమైతే.. ఇతర సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా తమ బలాన్ని చాటుకునేందుకు ఆ సంఘం నాయకులు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన టీఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషన ల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు డిపోల్లో గేట్‌ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ)తో పోటీకి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గుర్తులు కేటాయించిన తర్వాత మరి కొన్ని యూనియన్ల మధ్య పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు.

షెడ్యూల్‌ ఇలా

ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోటీ చేసేందుకు యూనియన్ల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం డీఎంల ద్వారా రిట ర్నింగ్‌ అధికారులకు డ్రాఫ్ట్‌ అభ్యంతరాలకు ఆహ్వా నం, 24న ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 25న తుది ఓటర్ల జాబితా, 26న గుర్తుల కేటాయింపు, అదే రోజు తుది ఓటర్ల జాబితాను రిటర్నింగ్‌ అధికారులు సమర్పించనున్నారు. 29న డమ్మీ బ్యాలెట్‌ పేపర్ల సమీకరణ, అక్టోబర్‌ 9న పోలింగ్‌, అక్టోబర్‌ 14, 15న పోస్టల్‌ బ్యాలెట్‌, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement