నాణ్యమైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

Sep 22 2026 12:18 AM | Updated on Sep 22 2026 12:18 AM

సిరిసిల్ల/బోయినపల్లి: పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీందర్‌నాయక్‌ కోరారు. బోయినపల్లి పీహెచ్‌సీని సోమవారం పరిశీలించి, జిల్లా కేంద్రంలోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో ప్రోగ్రాం ఆఫీసర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో ఆల్ఫ్రెడ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్‌బాబు, రామారెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ అ నిత, ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, నయీమ జహా పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

సిరిసిల్ల: బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. డీపీవో ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు 19 ఫిర్యాదులు వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా ఠాణాల అధికారులకు సూచించారు.

డీజేలకు అనుమతి లేదు

గణేశ్‌ శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. సిరిసిల్లలోని పలు గణేశ్‌ మండపాలను రాత్రి టౌన్‌ సీఐ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,200 గణేశ్‌ మండపాలు ఏర్పాటు చేశారని వివరించారు.

బాలసాహిత్యకర్త అశోక్‌కు పురస్కారం

సిరిసిల్ల అర్బన్‌: విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, బాలసాహిత్యకర్త గరిపెల్లి అశోక్‌కు ఖమ్మం చాంద్‌ సితారె సంస్థ తొలి పురస్కారం అందజేసింది. ఖమ్మంలోని పీఆర్టీయూ భవన్‌లో సంస్థ అధ్యక్షుడు షఫీ, ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందజేశారు.

పకడ్బందీగా నిమజ్జనం ఏర్పాట్లు

వేములవాడ: గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు ఆదేశించారు. గుడి చెరువు కట్టపై ఏర్పాట్లను సోమవారం కమిషనర్‌ లో కేశ్‌, మేనేజర్‌ సంపత్‌రెడ్డితో కలిసి పరిశీలించా రు. వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్‌ కొండ రాజశేఖర్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుకుమార్‌ పాల్గొన్నారు.

విధుల్లో చేరిన ఏడీఈ అశోక్‌

సిరిసిల్ల: పరిశ్రమల సేవల మీటరు రిలే టెస్టింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌(ఏడీఈ)గా అశోక్‌ సోమవారం విధుల్లో చేరా రు. కామారెడ్డి జిల్లాలో ఏడీఈగా పనిచేసిన అశోక్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఆయనకు ఏఈడీ రాజలింగం, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సీని యర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సూరయ్య, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌, సుధీర్‌, సత్తయ్య స్వాగతం పలి కారు. గతంలోనూ సిరిసిల్ల టౌన్‌ ఏఈఈగా అశోక్‌ ‘సెస్‌’ పరిధిలో పనిచేశారు.

రాజన్నకు రూ.లక్ష విరాళం

వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి వరంగల్‌లోని పెరికవాడకు చెందిన అంచూరి నర్మద, కుమారుడు లోకేశ్వర్‌, కుమార్తె భవాని రూ.1,20,001 నగదు విరాళంగా పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మకు సోమవారం అందజేశారు. ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement