సిరిసిల్లటౌన్: వినియోగదారుల సహకారంతో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో ముందుకుసాగుతోందని బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం బ్యాంకు 40వ వార్షిక మహాసభ స్థానిక పద్మశాలి కల్యాణ భవనంలో నిర్వహించారు. బ్యాంకులో నూతన సభ్యత్వం రూ.5వేలు వాటా ధనాన్ని బ్యాంకు నెట్‌వర్త్ పెంచి ఇస్తున్నామన్నారు. ఖాతాదారులకు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడంతోపాటు కొత్తగా వేములవాడ, కరీంనగర్ బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాటాదారులకు 14 శాతం డివిడెండ్‌ను 2025–26 సంవత్సరానికి ఇస్తున్నామన్నారు. బ్యాంక్ మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, గాజుల బాలయ్య, గాజుల నారా యణ, బుర్ర నారాయణగౌడ్, కోడం అశోక్ తదితరులు బ్యాంకు సేవలపై సూచనలు అందజేశారు.
అనవసర ఖర్చులు అదుపులో పెట్టాలి
బ్యాంకు లావాదేవీల్లో పెరుగుతున్న అనవసర ఖర్చులు అదుపులో పెడుతూనే వాటాదారులపై భారం మోపకుండా చూడాలని సభ్యులు కోరారు. ముఖ్య పోస్టుల్లో ఉన్న వారి జీతాలు అధికంగా ఉన్నాయని, మహాసభ ఖర్చులు కూడా లక్షలు దాటుతున్నాయన్నారు. పాతవాహనం రిపేరుకు రూ.3లక్షలు ఖర్చు చేయడం ఏంటని పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ తదితరులు ప్రశ్నించారు. బ్యాంక్ వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, కార్యవర్గ సభ్యులు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజుగౌడ్, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, సీఈవో పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


