ప్రజా‘వాణి’ వినండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా‘వాణి’ వినండి

Sep 22 2026 12:18 AM | Updated on Sep 22 2026 12:18 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● 172 అర్జీలు స్వీకరణ

సిరిసిల్ల అర్బన్‌: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 172 దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 18 దరఖాస్తులు రాగా, ఎంపీడీవో కార్యాలయాల్లో 59 అర్జీలు వచ్చాయి. ప్రజా వాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

స్కావెంజర్లకు వేతనాలు ఇప్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లోని స్కావెంజర్లకు ప్రతీ నెల వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నాం. శ్రమ దోపిడీకి గురవుతున్నాం. ఇప్పటికై నా జూన్‌ నుంచి ఈనెల వరకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇప్పించండి.

– స్వీపర్స్‌, స్కావెంజర్స్‌ యూనియన్‌ సభ్యులు

చర్యలు తీసుకోండి

బోయినపల్లి మండలం నీలోజిపల్లిలోని 8వ వార్డులో గణేశ్‌ మండపం వద్ద అన్నదానం నిర్వహించాం. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తిన్న ప్లేట్లు, చెత్తను తీసుకుపోవడానికి వస్తే.. సర్పంచ్‌ మాత్రం వాటిని తీసుకుపోవద్దనడంతో వారు ఆ చెత్తను అక్కడే వదిలేసి పోయారు. తర్వాత రోడ్డుపై చెత్త వేశారంటూ పంచాయతీ కార్యదర్శి రూ.500 జరిమానా విధించారు. దీనిపై విచారణ చేపట్టి సర్పంచ్‌, కార్యదర్శిపై చర్యలు తీసుకోండి.

– నీలోజిపల్లి గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement