దంచికొట్టిన వర్షం | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వర్షం

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం వాన దంచికొట్టింది. బోయినపల్లిలో అత్యధికంగా 22.5 మిల్లీమీటర్ల వర్షం పడగా.. తంగళ్లపల్లిలో 22.3, ఎల్లారెడ్డిపేటలో 18.8, గంభీరావుపేటలో 11.6, రుద్రంగిలో 1.4, చందుర్తిలో 4.3, వేములవాడ రూరల్‌లో 4.6, సిరిసిల్లలో 9.4, కోనరావుపేటలో 1.9, ముస్తాబాద్‌లో 8.7, ఇల్లంతకుంటలో 3.0 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 8.3 మిల్లీ మీటర్లుగా నమోదైంది.

కాటన్‌ చీరల కార్మికులకు న్యాయం చేయండి

సిరిసిల్లటౌన్‌: కాటన్‌ చీరల కార్మికులు, ఆసాములకు న్యాయం చేయాలని సీఐటీయూ నేతలు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. నిరవధిక సమ్మెలో ఉన్న కాటన్‌ చీరలు ఉత్పత్తి చేసే కార్మికులు, ఆసాములపై యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మూశం రమేశ్‌, కోడం రమణ ఉన్నారు.

ఆత్మరక్షణకు కరాటే

వేములవాడ: బాలికల ఆత్మరక్షణకు కరాటే అవసరమని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వేములవాడలోని ఓకినావా స్పోర్ట్స్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం కరాటే గ్రేడింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. కటాస్‌, కిక్‌ బ్యాలెన్సింగ్‌ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్‌, గ్రీన్‌, బ్లూ, మెరున్‌ బెల్టులు ప్రదానం చేశారు. కరాటే మాస్టర్‌ అబ్దుల్‌ మన్నాన్‌ను అభినందించారు. సీనియర్‌ కరాటే మాస్టర్‌ కనకరపు రాజశేఖర్‌ ఉన్నారు.

కూలిన పెంకుటిల్లు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని దేశాయిపల్లెకు చెందిన నకీర్తి బాలయ్య పెంకుటిల్లు ఇటీవల కురిసన వర్షాలతో కూలిపోయింది. దీంతో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశాలతో ఎంపీడీవో డి.రమేశ్‌ ఆదివారం దేశాయిపల్లెలో పర్యటించారు. కూలిన పెంకుటిల్లును పరిశీలించి అర్హత ఉండడంతో ఇందిరమ్మ ఇంటి మంజూరుకు జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. సర్పంచ్‌ కంకణాల రజిత–రమేశ్‌, కార్యదర్శి సలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు అవార్డు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని గూడెం గ్రామానికి చెందిన ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు ఉత్తమ సేవ–2026 అవార్డు వచ్చింది. ఈ మేరకు భువనగిరి జిల్లా ఆత్మకూరు భారత్‌ రక్తాదాన్‌ ఎన్జీవో ఉత్తమ సేవా అవార్డును సంస్థ అధ్యక్షుడు మేడి సురేశ్‌కు ఆదివారం అందజేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రేరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు అవార్డు అందజేశారు. అవార్డును అందుకున్న సురేశ్‌, సభ్యులు వెంకట్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement