ఘాటెక్కిన ఉల్లి | - | Sakshi
Sakshi News home page

ఘాటెక్కిన ఉల్లి

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

● ఆకాశంలో సరుకుల ధరలు ● సలసలమంటున్న నూనెలు ● సామాన్యులకు భారం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉల్లిగడ్డ..ఎల్లిగడ్డ..నూనె.. ఏది చూసిన ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు సరుకులకే సరిపోతలేవు. ఇక పిల్లల చదువులు.. వైద్యం.. పండుగలు.. పబ్బాల ఖర్చులు భరించడం మరింత భారమవుతున్నాయి. జీతాలు.. కూలి పనులు.. వ్యాపారాల నుంచి ఆదాయం అంతంతే వస్తుండగా నిత్యావసరాల సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన సరుకుల ధరలు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. పెరిగిన ధరలు.. సామాన్యుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

భగ్గుమంటున్న ధరలు

నిత్యావసర సరుకుల ధరలు గత పదిహేను రోజుల్లో విపరీతంగా పెరిగాయి. గతంలో ఉల్లిగడ్డ రూ.100లకు ఐదు కిలోల చొప్పున విక్రయించగా.. నేడు కిలో రూ.75 నుంచి రూ.80 పలుకుతోంది. ఎల్లిగడ్డ రూ.250కి చేరింది. ఇక చక్కెర కిలో రూ.60, లీటర్‌ సన్‌ఫ్లవర్‌ నూనె రూ.185, పల్లినూనె రూ.160కి చేరింది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుల నెలవారీ ఖర్చు సైతం యాభై శాతానికి పైగా అధిక భారమయ్యాయి.

సామాన్యుల జేబుకు చిల్లు

నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు అధికమయ్యాయి. గతంలో నలుగురు ఉన్న కుటుంబానికి ఒక నెలలో నిత్యావసర సరుకులకు రూ.5వేల వరకు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు రూ.7వేల వరకు చేరుకుంటుంది. ఒక నెలలో రూ.2వేల వరకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడంతో ప్రైవేట్‌ ఉద్యోగులు, కూలి పనులు చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది తమ ఖర్చు తగ్గించుకునేందుకు సర్దుకుపోతున్నారు. సరుకుల్లో కోత పెట్టుకోవడం, కొన్ని వస్తువులను తాత్కాలికంగా కొనుగోలు చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement