భావ ప్రకటన స్వేచ్ఛకు సోషల్‌మీడియా మంచి వేదిక. ప్రజలకు విజ్ఞానాన్ని పంచేందుకు చక్కటి సాధనం. దురదృష్టవశాత్తూ దీన్ని దుర్వినియోగానికి వాడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాలంలో వచ్చే కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఫేక్ కంటెంట్‌తో సమాజంలో అలజడులు రేపే, రెచ్చగొట్టే కంటెంట్, వీడియోలపై రిపోర్టు చేస్తే చర్యలు తీసుకుంటాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్
సోషల్ మీడియా ఫేమ్, పరిచయాలు, తాత్కాలిక ఆకర్షణలు జీవిత నిర్ణయాలను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి. వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలి. అప్పుడే సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ బంధాలను కాపాడుకోగలుగుతాం.
– ప్రీతి,
మానసిక వైద్య నిపుణురాలు


