చదువుతోపాటు భరతనాట్యంలో రాణిస్తోంది ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన మూల ఆరాధ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపులో తోటి కళాకారులతో కలిసి నాట్య ప్రదర్శన చేసింది. ఆరాధ్య తల్లిదండ్రులు భూపాల్‌రెడ్డి, మానస. ఆరాధ్య ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి చదువుతోంది. 4వ తరగతి నుంచి భరతనాట్యంలో స్థానిక నాట్య కళా అకాడమీలో శిక్షణ పొందింది. రెండేళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలిచ్చింది. ఈనెల 6న అస్సాంలోని గౌహతిలో నాట్యజరి ఫెస్టివెల్‌లో పాల్గొంది. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం, ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దాదాపు 20 ప్రదర్శనలిచ్చింది.
– ఇల్లంతకుంట(మానకొండూర్)


