బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

● సీఈవో శ్రీనివాస్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ప్రధాన రహదారిపై శనివారం బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. రోడ్డుకు ఇరువైపులా జాగిలంతోపాటు బాంబులను గుర్తించే పరికరాలతో తనిఖీలు చేశారు. ఈనెలాఖరును జిల్లాకు ముఖ్యమంత్రి వస్తానని ప్రకటించడం.. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టడం చర్చనీయంగా మారింది.

పారితోషికం చెల్లించండి

వేములవాడ: తమకు అధికారులు ఇచ్చిన హామీ మేరకు 50 శాతం పారితోషికం చెల్లించాలని పేర్కొంటూ రాజన్న కల్యాణకట్టలో పనిచేసే నాయీబ్రాహ్మణులు శనివారం నిరసన తెలిపారు. పార్కింగ్‌ స్థలం వద్దనున్న కల్యాణకట్టలో ప్రైవేట్‌ నాయీబ్రాహ్మణులు పనులు చేస్తుంటారు. వీరికి టికెట్‌పై యాభై శాతం ఇస్తామని ముందుగా ప్రకటించి, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. దీంతో చేసేదేమి లేకనే భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదులు వెల్లడంతో చర్యలకు దిగారన్నారు. ఈనేపథ్యంలోనే తమకు టికెట్‌పై యాభై శాతం పారితోషికం ఇవ్వాలని నిరసన తెలిపారు.

భూముల రీసర్వే కోసం గ్రామసభలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని జంగారెడ్డిపల్లి, తిప్పాపురం, జవారిపేట, రహీంఖాన్‌పేటల్లో శనివారం భూముల రీసర్వే కోసం సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌, రెవెన్యూ అధికారులు శనివారం గ్రామసభలు నిర్వహించారు. ఏడీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీసర్వే కోసం పైలట్‌ ప్రాజెక్టుగా సిరికొండ, రహీంఖాన్‌పేట, తిప్పాపురం, జవారిపేట, జంగారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేశారన్నారు. సిరికొండలో భూముల రీసర్వే సాగుతోందని పేర్కొన్నారు. ఏ భూముల వద్ద సర్వే చేస్తారో ఆ ప్రాంతంలోనీ రైతులు భూమికి సంబంధించిన కాగితాలు తీసుకురావాలని సూచించారు. డీఐ వెంకటాచారి, తహసీల్దార్‌ సురేష్‌, సర్పంచులు మంజుల, పండుగ సునీత, నాగరాజు, కమటం లావణ్య, ఆర్‌ఐ సంతోష్‌, కార్యదర్శి పులి సంధ్య, జీపీవో ఆంజనేయులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

సిరిసిల్ల అర్బన్‌: రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు జిల్లా నుంచి 45 మంది ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ తెలిపారు. మినీస్టేడియంలో శనివారం నిర్వహించిన పోటీల్లో 13 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌–14, 16, 18, 20 బాలబాలికలకు మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలు నిర్వహించారు. ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. వ్యాయాయ ఉపాధ్యాయులు రాజు, అశోక్‌, శైలజ, అజయ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

రేపు సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు వార్షిక మహాసభ

సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంకు 40వ వార్షిక మహాసభ సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఈవో పత్తిపాక శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో బ్యాంకు చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మహాసభ జరుగుతుందని వివరించారు. 2025–2026 బడ్జెట్‌ ఖర్చుల ఆమోదం, నికర లాభం పంపిణీ, 2026–2027 వార్షిక బడ్జెట్‌ ఆమోదంపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement