సిరిసిల్లటౌన్: స్వచ్ఛ సిరిసిల్ల కీర్తిని కాపాడేలా ప్రజలు బాధ్యతగా ఉండాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్లను ఆవిష్కరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు, భక్తులు సహజమైన పువ్వులను, రంగులను మాత్రమే వాడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, వైస్‌చైర్మన్ దార్ల సందీప్, విప్ బుర్ర మల్లికార్జున్, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్ సభ్యులు బూర బాలు, ఎర్రం వెంకట్రాజం, మొగిలి నాగరాజు, కూ ర భాగ్యలక్ష్మి దేవరాజ్, ఎలుక వెంకటేశం, అడిచెర్ల రూపసాయికృష్ణ, పాషికంటి రమ్య, బత్తుల రమేశ్, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్ పాల్గొన్నారు.


