వాతావరణానికి అనుగుణంగా సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వాతావరణానికి అనుగుణంగా సాగు చేయాలి

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

● ఆత్మ కమిటీ చైర్మన్‌ ముకుందరెడ్డి

● ఆత్మ కమిటీ చైర్మన్‌ ముకుందరెడ్డి

చందుర్తి(వేములవాడ): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి కోరారు. మండలంలోని సనుగులలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముకుందరెడ్డి మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు పంటల పెరుగుదలపై ప్రభావం చూపుతాయన్నారు. వ్యవసాయాధికారి దుర్గారాజు, సర్పంచ్‌ బొడిగే లావణ్య, రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ సాయికుమార్‌, ఏఈవో శారద పాల్గొన్నారు.

చేయూత దరఖాస్తులపై విచారణ

ముస్తాబాద్‌(సిరిసిల్ల): చేయూత పింఛన్‌ దరఖాస్తులపై నామాపూర్‌ గ్రామపంచాయతీలో శనివారం విచారణ చేపట్టారు. దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు చేసుకున్న దరఖాస్తులను ఏవో అనూష పరిశీలించారు. సర్పంచ్‌ అనిల్‌, ఉపసర్పంచ్‌ కొంరయ్య, కార్యదర్శి రాజు ఉన్నారు.

సదరం శిబిరాలు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఈనెల 21 నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ శనివారం తెలిపారు. సెప్టెంబరు 21న ఆర్థోపెడిక్‌(ఎముకలు), కంటిచూపు శిబిరం, 23న వినికిడి, జనరల్‌, 24న వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక వైకల్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. అక్టోబరు 1, 3, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్‌ పరీక్షలు, 3న మానసిక, 8, 15, 22, 26న కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. యూడీఐడీ దరఖాస్తు ఫామ్‌తోపాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్‌ఫోన్‌, సంబంధిత మెడికల్‌ డాక్యుమెంట్లు, ఎక్స్‌రే వంటి వాటిని తీసుకుని శిబిరాలకు రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement