● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● చేనేత వస్త్ర వ్యాపార సంఘం ప్రమాణస్వీకారం
సిరిసిల్లటౌన్: నేతన్నల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇక్కడి వస్త్రపరిశ్రమ అభివృద్ద్ధికి, నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలిపిందని గుర్తుచేశారు. రూ.49 కోట్ల నేతన్నల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. నేతన్నల విద్యుత్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలోనే సిరిసిల్ల విద్యుత్ సంస్థ ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చిన 48 గంటల్లోనే 25 హెచ్‌పీ విద్యుత్ కనెక్షన్లలో మార్పు చేశామన్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.
నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడిగా తాటిపాముల దామోదర్, ఉపాధ్యక్షుడిగా గౌడ రాజు, కార్యదర్శిగా శ్రీగాధ విష్ణు, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కోశాధికారిగా సామల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేశం, గుండేటి మధుకర్, మేర్గు సత్యనారాయణ, అన్నల్‌దాస్ సురేష్, దూస కృష్ణప్రసాద్, జిందం రవి, కళ్యాడపు పాండురంగం, రిక్కుమల్లె బాలశివరామకృష్ణ, కోడం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ విప్ ఈరపత్రి అనిల్‌కుమార్, టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ అధ్యక్షుడు దూడం వెంకటరమణ, వైస్‌చైర్మన్ జక్కని లత, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కే.కే.మహేందర్‌రెడ్డి, రాపెల్లి లక్ష్మీనారాయణ, దార్ల సందీప్ పాల్గొన్నారు.


