ఇక.. పల్లెలు పరిశుభ్రం | - | Sakshi
Sakshi News home page

ఇక.. పల్లెలు పరిశుభ్రం

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

● అక్టోబర్‌ 2 వరకు కార్యక్రమాలు ● ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి

● అక్టోబర్‌ 2 వరకు కార్యక్రమాలు ● ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టి

గంభీరావుపేట(సిరిసిల్ల): పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత హీ సేవ–2026 కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్‌, వికసిత భారత్‌’ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘వోల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌–వోల్‌ ఆఫ్‌ సొసైటీ’ విధానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, గ్రామస్తుల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు,

కార్యక్రమాలివే..

గ్రామాల్లో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరచడం, ప్రజలకు తడి–పొడి చెత్తపై అవగాహన కల్పించడం, పారిశుధ్యంపై ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞలు, వ్యాసరచన, చిత్రలేఖనం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు యువతను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయనున్నారు.

గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

గ్రామపంచాయతీల పరిధిలో ప్రధాన కూడళ్లు, రహదారులు, బస్టాండ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కా ర్యాలయాల పరిసరాలు, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను శుభ్రపరచాలని సూచిస్తున్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించేలా అవగాహన కల్పించనున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలతో ఈ పక్షోత్సవాలను ముగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement