తరచూ ధరల హెచ్చుతగ్గులతో మార్కెట్‌లో ఇబ్బంది ఎదురవుతుంది. ధరలు సైతం పెరి గిపోవడంతో వినియోగం పడిపోయి ంది. గతంలో ఎక్కువ సరుకులు తీసుకునే వారు ఇప్పుడు తగ్గించుకుంటున్నారు. ధరలు పెరుగుదల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. – శ్రీనివాస్, ట్రేడర్
ధరలు బాగా పెరిగాయి
నెల రోజులకు, ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయి. గతంలో నెలకు రూ.5వేల వరకు సరుకులకు ఖర్చు పెట్టేవాళ్లం. ధరలు పెరిగిపోవడంతో నెలవారీ సరుకుల బిల్లులు కూడా పెరుగుతున్నాయి.
– బాపురెడ్డి, ప్రైవేట్ ఉద్యోగి, ఎల్లారెడ్డిపేట
సర్దుకుపోతున్నాం
గతంలో కిచెన్‌లో అవసరం ఉన్న సరుకులు ఎక్కువ మొత్తంలో కొనేవాళ్లం. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తక్కువ మొత్తంలో కొని, వాటితోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
– కనకవ్వ, గుట్టపల్లిచెరువు తండా, గృహిణి


