వేములవాడ: భీమన్నను ఆదివారం 10 వేల మంది దర్శించుకున్నారు. వర్షం కురుస్తున్నా బారులుతీరారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
● సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తంలో భూమి తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని నోటీస్‌లో స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల ద్వారా కోరారు.


