రూ.
రూ.
రూ.
రూ.
టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మద్యం దుకాణాలు
ఎమ్మార్పీతో సంబంధం లేకుండా మద్యం విక్రయాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 వేలకు పైగా బెల్ట్ షాపులు
ఒక్కో రెస్టారెంట్ నుంచి పోలీసు, ఎకై ్సజ్ మామూళ్లు నెలకు రూ.40 వేలు
మద్యం బాటిళ్లపై రూ.20 నుంచి రూ.70 వరకు అదనంగా వసూళ్లు
ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం!
టీడీపీ ముఖ్యనేతలకు, అధికారులకు వాటాలు
చుక్క చుక్కపై
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ఏటీఎంలుగా మద్యం దుకాణాలను సొంత వ్యక్తులకు కేటాయించింది. తద్వారా మొత్తం మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తోంది. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన మద్యం దుకాణాల కంటే అధికంగా బెల్ట్ షాపులు తెరచి అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒంగోలు నుంచి మొదలుకొని మారుమూల గ్రామాలైన పుల్లలచెరువు, దిగువమెట్ట వరకు ఏ గ్రామంలో అయినా సరే బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి, తెల్లవారుజాము అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.
కీలక నేత కనుసన్నల్లోనే...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో మొత్తం 39 మద్యం దుకాణాలు ఉన్నాయి. నగరానికి ఎటు వైపు వెళ్లినా ఒక మద్యం దుకాణం తప్పకుండా కనిపిస్తుంది. జాతీయ రహదారి సమీపంలోనే మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడ మద్యం షాపులన్నీ కీలక నేత చేతుల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటీ అరా దుకాణాలు ఇతరుల చేతికి వెళ్లినా వారిని తన దారికి తెచ్చుకొని మద్యం దుకాణాలను తన గుప్పిట్లో ఉంచుకున్నట్లు కూటమి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మాట వినని మద్యం దుకాణాల నిర్వాహకులకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కీలక నేత దుకాణాలు కావడంతో ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు ఇటువైపు తొంగిచూసే సాహసం చేయడంలేదు. దాంతో ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు ఒక్కటి కూడా అమలు కావడంలేదని కొంతమంది పచ్చ పార్టీ నాయకులే గొణుక్కుంటున్నారు. పర్మిట్ రూంలతో సంబంధం లేకుండా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. కొప్పోలు వంటి ప్రదేశాల్లో పార్టీ నాయకులే బహిరంగంగా బెల్ట్ షాపులు పెట్టి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా అధికారులు మాత్రం క్షణం తీరికలేనట్లు నాటకాలాడుతున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
లక్ష్మీ కటాక్షం లేకుంటే ఇక్కడ కుదరదంతే..
దర్శి నియోజకవర్గంలో లక్ష్మీ కటాక్షం లేకుండా వ్యాపారం చేయడం కుదరదని పచ్చ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అధికారికంగా 23 దుకాణాలు ఉండగా ఒక లైసెన్స్ బార్ ఉంది. 50కి పైగా రెస్టారెంట్లలో అనధికారికంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నియోజకవర్గంలో 800లకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపులకు ఒక ఆటో ద్వారా దుకాణాల నుంచి నేరుగా తెల్లవారు జామున ఐదు గంటలకే మద్యం తరలిస్తారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్లకు అమ్మాల్సి ఉండగా రూ.20 అదనంగా అమ్ముతున్నారు. రెస్టారెంట్‌లు, బెల్ట్ షాపుల్లో ఏకంగా రూ.50 పైగా అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ముఖ్య నేత ఒత్తిడి వల్లే అధికారులు చోద్యం చూస్తున్నారని జనం గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్య నేత అనుచరులు ఇచ్చింది పుచ్చుకోవడం, చెప్పినట్లు నడుచుకోవడమే అధికారుల డ్యూటీ అని చెప్పుకుంటున్నారు. దర్శి మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత మధ్యవర్తిగా పనిచేస్తూ ఎకై ్సజ్ అధికారుల తరఫున నెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఐదు మండలాల్లో పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ముఖ్య పోలీస్ కానిస్టేబుల్ వసూళ్ల వ్యవహారం నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దర్శి నియోజకవర్గంలో ఒక్కో రెస్టారెంటుకు రూ.40 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ డబ్బుల్లో ఎకై ్సజ్, పోలీసు సిబ్బందికి 50:50 ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్పీ కంటే అదనంగా అమ్మకాలు...
జిల్లాలో ఎక్కడా ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయిస్తున్న దాఖలాలు లేవు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతకు సొంత దుకాణం ఉంది. ఆయన దుకాణంలోనే బ్రాండెడ్ మద్యం విక్రయించాలని ఆయన హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో పట్టణంలో ఎక్కడా బ్రాండెడ్ మద్యం దొరకదు. అంతేకాకుండా ఆయన దుకాణంలో ఎమ్మార్పీ రేటుకు మద్యం విక్రయించరు. ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తుంటారు. బహిరంగంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. దాంతో సదరు కీలక నేత ఆడింది ఆట పాడింది పాట అన్న విధంగా తయారైంది. తూర్పున ఉన్న ఒక మంత్రి నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్లో రూ.40 నుంచి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లా మార్కాపురంలో రూ.20, రూరల్ ప్రాంతంలో రూ.50 అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో బాటిల్ మీద రూ.20 వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సొమ్మంతా ముఖ్య నాయకుడి జేబుల్లోకి చేరుతున్నట్లు పచ్చపార్టీ నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో సైతం రూ.50 వరకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒంగోలులో కూడా రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకుంటున్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు.
మద్యం కమీషన్లపై వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్లు:
మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతకు, ఎకై ్సజ్ అధికారులకు భారీ మొత్తంలో నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నట్లు మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయమై రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వైరల్ అవుతున్నాయి. కలెక్షన్ బాబు, కరప్షన్ బాబు అంటూ వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ఇక్కడ టీడీపీలోని ఒక వర్గం ముఖ్యనేతపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోవడంతో పచ్చపార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. అధిష్టానమే పట్టించుకోకపోతే మేమేం చేయగలమని కొందరు నాయకులు కూటమికి దూరంగా ఉంటున్నారు.
ఎటు చూసినా బెల్ట్ షాపులే...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలో 800 బెల్ట్ షాపులు, కొండపిలో 390, మార్కాపురంలో 114, యర్రగొండపాలెంలో 220, ఒంగోలులో 200, కందుకూరులో 500, గిద్దలూరులో 250, కనిగిరి నియోజకవర్గంలో 200కి పైగానే బెల్ట్ షాపులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం మీద 2500 నుంచి 3 వేల వరకు బెల్ట్ షాపులు ఉన్నట్లు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నా ఎకై ్సజ్, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదు. ముడుపులు ఇవ్వని షాపులు, కీలక నేతల చెప్పుచేతల్లో ఉండని దుకాణాల మీద మాత్రమే తనిఖీలు నిర్వహించడం, కేసులు పెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ నాయకులకు చెందిన మద్యం దుకాణాలను వదిలిపెడుతున్నారని ఆరోపణలున్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం
పరవళ్లు తొక్కుతోంది. మంచినీరు దొరకని గ్రామం ఉంది కానీ మద్యం దొరకని ఊరులేదు. జిల్లా కేంద్రాల నుంచి మారుమూల గ్రామాల వరకు అడుగడుగునా బెల్టుషాపులు
యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మద్యం షాపులను టీడీపీ నేతలు చెప్పు చేతల్లో ఉంచుకుని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎవరి వాటాలు వారికి వెళ్తుండటంతో ఎకై ్సజ్, పోలీసు
అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
10
20
50
30


