న్యూస్‌రీల్
కూటమి వైఫల్యంతోనే ధరాఘాతం
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. రెండేళ్లలోనే ఏకంగా 50 నుంచి 100 శాతానికి ధరలు పెరిగిపోయాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క నెలలోనే
బియ్యం ధరలు 50 శాతానికి పెరిగాయి. చివరికి పచ్చడి
చేసుకొని తిందామనుకున్నా ఆ పరిస్థితి లేకుండా
పోయిందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఏం కొనేటట్టులేదు...ఏం తినేటట్టులేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేయడానికి చేతిలో పనులు లేవు. తినడానికి కడుపునిండా తిండి లేదు. పీకలదాకా తాగేందుకు మద్యం ఒక్కటే పుష్కలంగా దొరుకుతోంది. పాలకుల జేబులు నిండుతున్నాయి. పేదల కడుపులు ఖాళీగా ఉన్నాయి.


