ఒంగోలు సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివేకానంద బీఈడీ కాలేజ్, అనిబిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలకు మొట్టమొదటిగా ఏకేయూ అనుబంధ గుర్తింపును మంజూరు చేసినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ డీవీఎర్ మూర్తి, కళాశాలల అసోసియేషన్ ప్రెసిడెంట్ దివి రమేష్ తెలిపారు. గుర్తింపు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ హరిబాబు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ కేవీఎన్ రాజు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: మద్యం దుకాణాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచింది. తొలుత ఈ నెల 21 వరకు గడువు విధించిన రాష్ట్ర ప్రభుత్వం చివరితేది ముగిసినా పూర్తి దుకాణాలు రెన్యువల్ చేయించుకోకపోవడంతో మరో రెండు రోజుల పాటు అంటే 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేఏ బేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లాలో 124 మద్యం దుకాణాలు, 15 గీత కార్మికుల దుకాణాలు మొత్తం 139 దుకాణాలు ఉన్నాయని, వాటిలో 103 దుకాణాలు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో 75 జనరల్ దుకాణాలు, 9 కల్లుగీత కార్మికుల దుకాణాలు మొత్తం కలిపి 84 దుకాణాలు ఉన్నాయన్నారు. వాటిలో 66 మద్యం దుకాణాలకు రెన్యువల్ పూర్తయిందని, మిగిలిన 18 దుకాణాలకు రెన్యువల్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాలు కలుపుకొని 54 మద్యం దుకాణాలకు రెన్యువల్ చేయాలి.


