ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం

పామూరు: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సాధ్యమైనంత వరకు సత్వర న్యాయం అందించేలా పోలీసు అధికారులు కృషి చేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. సోమవారం పామూరు సర్కిల్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పోలీస్‌శాఖ మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌శాఖ మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పామూరులో ప్రత్యేకంగా మీ కోసం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పామూరు, పరిసర గ్రామాల ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఎస్పీ స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని చట్టపరంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి సోమవారం ప్రత్యామ్నాయంగా అన్ని సబ్‌డివిజన్ల పరిధిలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ కలహాలు, చీటింగ్‌, భర్త, అత్తారింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, ఇతర సమస్యలపై 41 ఫిర్యాదులు అందాయి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి.

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు ఎస్పీ భూమి పూజ...

పామూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఐఓసీఎస్‌ భాగస్వామ్యంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న పెట్రోల్‌ బంకు నిర్మాణానికి సోమవారం ఎస్పీ భూమి పూజ చేశారు. టెంకాయకొట్టి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పామూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నూతన పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ వెల్ఫేర్‌లో భాగంగా జిల్లాలోని పోలీస్‌ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి ఇన్‌చార్జ్‌ డీఎస్పీ పి.శ్రీధర్‌, పామూరు సీఐ దుర్గాసి వినోద్‌కుమార్‌, పొదిలి సీఐ మల్లి రాజేష్‌కుమార్‌, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్‌, ఎస్సైలు కట్టా అనూక్‌, పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ దేవప్రభాకర్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ఏఆర్‌ ఎస్సై తిరుపతిస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ హర్షవర్థన్‌రాజు

పామూరులో పోలీస్‌శాఖ మీ కోసం

కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement