సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు సబర్బన్‌: ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి అత్యున్నత ప్రాధాన్యమిచ్చి వేగవంతంగా, నాణ్యంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, డీఆర్‌ఓ పి.వెంకటరమణ, ఎస్డీసీ మాధురితో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. సాధారణ గ్రీవెన్స్‌లో 397 అర్జీలు, మధ్యాహ్నం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో 61 అర్జీలు కలిపి మొత్తం 458 అర్జీలు నమోదయ్యాయని కలెక్టర్‌ వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల పట్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను స్వయంగా పరిశీలించి త్వరితగతిన గుర్తించి శాశ్వత పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలను కేవలం సాంకేతికంగా ముగించడం కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా నాణ్యమైన, సహేతుకమైన పరిష్కారం చూపాలని తేల్చిచెప్పారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల తమ స్థాయిలో పరిష్కరించలేని పరిస్థితి ఉంటే, దానికి గల స్పష్టమైన కారణాలను అర్జీదారులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. సర్వేయర్ల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాలని కలెక్టర్‌ సూచించారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేసి సమస్యలు పరిష్కరించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు క్రమంగా అర్జీల సంఖ్య తగ్గాలని, క్షేత్ర స్థాయిలో నిరంతరం సమస్యలు పరిష్కారమయ్యే వాతావరణం రావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐ.వి.ఆర్‌.ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ సర్వేలో ప్రజల నుంచి అత్యుత్తమ సానుకూల అభిప్రాయం లభించేలా అధికారులు చురుగ్గా పనిచేయాలని, రీ–ఓపెన్‌ అయ్యే అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement