వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ గణనాథుని విగ్రహాలను సమీపంలోని సముద్ర తీర ప్రాంతాల్లో, కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. కొత్తపట్నం, పాకల, ఈతముక్కల సముద్ర తీరాల్లో దాదాపు 600 విగ్రహాలను నిమజ్జనం చేశారు. నీట మునిగిన విగ్రహాలు అలల తాకిడికి ముక్కలై తిరిగి తీరానికి చేరుతున్నాయి. విగ్రహాలతో పాటు పత్రి, ప్లాస్టిక్ సంచులు, భారీదండలను కూడా నీటిలో వేయడంతో అవన్నీ తీరానికి కొట్టుకొచ్చి సముద్ర తీర ప్రాంతమంతా కాలుష్యమయమైంది. అధికార యంత్రాంగం స్పందించి తీరాన్ని శుభ్రం చేయించాలని పర్యాటకులు కోరుతున్నారు. కురిచేడు ప్రాంతంలో సాగర్ కాలువల్లో నీరు లేకపోయినా అలాగే విగ్రహాలను వదిలేసి వెళ్లారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


