తౌషిక్‌ మృతిపై వాస్తవాలు బయటపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

తౌషిక్‌ మృతిపై వాస్తవాలు బయటపెట్టాలి

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

సింగరాయకొండ: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి తౌషిక్‌ అనుమానాస్పద మృతిపై వాస్తవాలను బయటపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాల వద్ద ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఫిబ్రవరిలో చోటుచేసుకున్న తౌషిక్‌ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. కుమారుడు చనిపోయాడన్న వేదనతోపాటు న్యాయం చేయాలన్న తన గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో తౌషిక్‌ తల్లి మౌలాబీ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడితే, ఆమె మానసిక స్థితి బాగోలేదని పోలీసులు పేర్కొనడం బాధాకరం. బాధితుల కుటుంబానికి ఎమ్మార్పీఎస్‌ అండగా ఉంటుంది. ఈ దారుణ ఉదంతంపై త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

మందకృష్ణ మాదిగ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement