గంగ ఒడికి గణపయ్య | - | Sakshi
Sakshi News home page

గంగ ఒడికి గణపయ్య

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

గంగ ఒడికి గణపయ్య

భక్తులతో కోలాహలంగా ఉన్న కొత్తపట్నం సముద్ర తీరం

ఒంగోలులో వినాయక విగ్రహాల ఊరేగింపులో నృత్యం చేస్తున్న యువకులు

గణేష్‌ ప్రతిమతో చిన్నారి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలలో గణనాథుని భక్తిశ్రద్ధలతో పూజించి ఏడో రోజు ఆదివారం నిమజ్జనానికి తరలించారు.

గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్‌ మహరాజ్‌కూ జై అంటూ నినదిస్తూ..మేళతాళాలతో, గులాములు చల్లుకుంటూ..బాణసంచాతో అత్యంత ఉత్సాహంగా

ఊరేగింపులు నిర్వహించారు. డీజే సందడితో యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. సమీపంలోని సముద్ర తీర ప్రాంతాలు, రిజర్వాయర్లు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. సెలవు రోజు కలిసిరావడంతో పిల్లలు, పెద్దలు అందరూ భారీగా నిమజ్జన ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. కొత్తపట్నం, ఈతముక్కల, మడనూరు సముద్ర తీరాల్లో ఆదివారం ఒక్కరోజు సుమారు 550భారీ వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. వేలాదిగా తరలివచ్చిన వారితో తీరం భక్తజన సంద్రమైంది.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఒంగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement