వ్యాక్సిన్‌ లేని కరోనా కాంగ్రెస్‌: కేటీఆర్‌  | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ లేని కరోనా కాంగ్రెస్‌: కేటీఆర్‌ 

Published Thu, Nov 30 2023 2:54 AM

We will clean sweep all the seats in Greater Hyderabad says ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వ్యాక్సిన్‌ లేని కరోనా లాంటిది కాంగ్రెస్‌ పార్టీ. ఉద్యోగాల నియామకంలో అవాస్తవాలు ప్రచారం చేసింది. ‘థాట్‌ పోలీసింగ్‌’(ఓటరుపై తమ పార్టీ వైఖరిని బలవంతంగా రుద్దడం) అనే యుద్ధ నీతిని కాంగ్రెస్‌ ఎంచుకుంది. కాంగ్రెస్‌ వ్యూహకర్తలు ప్రాపగాండ చేసిన తరహాలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి లేదు. కొంత మంది అసంతృప్త యువత మినహా మిగతా వర్గాలన్నీ మాతోనే ఉన్నాయి’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షులు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2009 నవంబర్‌ 29న నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్‌’నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన రక్తదాన శిబిరం ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

‘ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారీగా కలిసి పోయాయని చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాంపల్లిలో రోడ్‌షో చేసిన కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాం«దీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పొరుగునే ఉన్న గోషామహల్‌కు వెళ్లకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో చెప్పాలి. కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రచారం చేయలేదు’అని ప్రశ్నించారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ గాలి 
‘బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో గెలవని ములుగు, హుజూరాబాద్, గోషామహల్‌తో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేస్తాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు, హుజూరాబాద్, గోషామహల్‌ తదితర చోట్ల గెలుస్తాం. రంగారెడ్డిలో రెండు మూడు చోట్ల గట్టి పోటీ ఉంది.

కాంగ్రెస్‌లో ఆఫీసులో తయారవుతున్న సర్వేలను పక్కన పెడితే గతంలో గెలిచిన 88 సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం. సాధారణ ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. రేవంత్‌రెడ్డి అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో రెండో చోట్లా ఓడిపోతారు. సర్పంచ్‌లు మొదలుకుని ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు రేవంత్‌ భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు.

రేవంత్‌ రెడ్డి సోదరుడు స్వతంత్ర అభ్యర్థి పోలింగ్‌ ఏజెంట్‌ అని చెప్పుకుంటూ కామారెడ్డిలో మకాం వేశారు.’’అని ఆరోపించారు. ’’కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నదే ఈ ఎన్నిక. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 49శాతం దాటకుంటే మేము విజయం సాధించినట్లే కదా. కేవలం 39 శాతం ఓట్లతోనే మోదీ దేశ ప్రధాని అయ్యారు’అని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

హరీశ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసు ఇవ్వాల్సింది 
‘కాంగ్రెస్‌ ఫిర్యాదుతోనే రైతు బంధు ఆగింది. ఉత్తమ్‌ డిల్లీకి వెళ్లి పిర్యాదు చేస్తే, రేవంత్‌ నవంబర్‌ 25న లేఖ రాశారు. 11 సార్లు రైతుబంధు పంపిణీ చేశాం. కొత్త పథకం కానప్పుడు నిలిపివేయడం ఎందుకు. పీఎం కిసాన్‌ పథకం నిధులు జమ చేస్తే కాంగ్రెస్‌ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. రైతుబంధు పథకం విషయంలో మంత్రి హరీశ్‌రావు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనకు నోటీసు జారీ చేసి సంజాయిషీ అడగాలి. రైతుబంధును నిలిపివేసి రైతులను శిక్షించడం ఎందుకు.

ఈసీ నిర్ణయాన్ని ఎత్తి చూపించడం మాత్రమే మా ఉద్దేశం. కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతుబంధు పథకం అమలవుతుంది. డిసెంబర్‌ 5 తర్వాత మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తాం. డిసెంబర్‌ 9న తెలంగాణపై ప్రకటన వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ వివిధ 
కార్యక్రమాలు ఉంటాయి. వచ్చే ప్రభుత్వంలో టూరిజం శాఖను తీసుకుని రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలని ఉంది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

స్టీఫెన్‌ రవీంద్ర కొత్త చొక్కా ఇచ్చారు 
దీక్షా దివస్‌ సందర్భంగా నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 9 వరకు జరిగిన ఘటనలను తలుచుకుంటూ కేటీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. నవంబర్‌ 29న కేసీఆర్‌ను అరెస్టు చేసి జైలుకు త రలించడం మొదలుకుని, డిసెంబర్‌ 10 వరకు జ రిగిన పరిణామాలు, తాను వరంగల్‌ జైలులో గడి పిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

దీక్ష సమయంలో నిమ్స్‌ ఆసుపత్రి వద్ద మఫ్టీలో ఉన్న ఓ పోలీసు అధికారి కేసీఆర్‌ ప్రాణాలకు హాని ఉందంటూ చేసిన హడావుడితో తాను, తనకు టుంబం ఆవేదన పడిన తీరును వివరించారు. కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన కస రత్తు, దీక్ష విరమణ తదితర పరిణామాలను వె ల్లడించారు. ఉద్యమ సమయంలో తన చొక్కా చింపిన పోలీ సు అధికారి స్టీఫెన్‌ రవీంద్ర తర్వాత కొత్త చొక్కా పంపిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు.  

 
Advertisement
 
Advertisement