మంత్రి మండిపల్లి రాజకీయానికి చెక్‌ పడిందా? | TDP Leader Sugavasi Prasad Babu Vs Minister Mandipalli Ramprasad Reddy | Sakshi
Sakshi News home page

మంత్రి మండిపల్లి రాజకీయానికి చెక్‌ పడిందా?

Oct 7 2026 12:12 PM | Updated on Oct 7 2026 12:32 PM

TDP Leader Sugavasi Prasad Babu Vs Minister Mandipalli Ramprasad Reddy

సాక్షి, అమరావతి : జిల్లా టీడీపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. నేతలను కరివేపాకులా వాడుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన మనసెరిగిన వారు చెబుతారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వ్యూహం చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజంపేట టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌ను రాజకీయంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జిల్లాలో తన వర్గ ప్రాబల్యం కోల్పోవడంతో ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన మార్క్‌ రాజకీయాలను తెరపైకి తెస్తుండటం గమనార్హం.  

రాయచోటి నుంచి గాలివీడుకు ఓటు మార్పు  
స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రసాద్‌ రాయచోటి మున్సిపాలిటీ నుంచి తన ఓటును గాలివీడుకు బదిలీ చేయించుకున్నారు. ఈ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఆయనను చంద్రబాబు బరిలోకి దింపి పోటీ చేయిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తే ప్రసాద్‌ కు జడ్పీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతుండగా ఈ వ్యవహారం మండిపల్లి వర్గానికి మింగుడు పడడం లేదు. 

రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మండిపల్లి ప్రస్తుతం మంత్రిగా ఉండగా అదే నియోజకవర్గానికి చైర్మన్‌ పదవి ఎలా ఇస్తారని మండిపల్లి వర్గం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు మార్క్‌ రాజకీయాలు తెలిసిన వారు ‘ఇదేమీ ఆశ్చర్యం కాదని.. రాజకీయ అవసరాలకు వాడుకొని, వదిలించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ అని వివరిస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా..చంద్రబాబు అంతిమ లక్ష్యం ప్రసాద్‌ను రాయచోటి టీడీపీ అభ్యర్థిగా చేయడమేనని తెలుస్తోంది. దీని కోసమే మంత్రికి వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకయిన ప్రసాద్‌ను  పక్కలో బల్లెంలా తీసుకొచ్చారని రాజకీయ పండితులు వివరిస్తున్నారు.    
ఇప్పటికే ఒంటరి చేశారు  
మండిపల్లికి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు క్రమక్రమంగా ఆయనకు జిల్లాలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కొంతకాలం క్రితం మండిపల్లి పీలేరు నియోజకవర్గం కలికిరిలో పర్యటించేందుకు కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోగా.. పార్టీ అధిష్టానం నుంచి కలికిరికి వెళ్లొద్దంటూ ఆదేశాలు రావడం తెలిసిందే.  దీంతోపాటు పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో అక్కడ నేతలతో కలిసి పర్యటించలేని పరిస్థితిని తీసుకొచ్చారు. తద్వారా మండిపల్లి  మంత్రి అయినప్పటికీ కేవలం రాయచోటికే పరిమితం కావాల్సి వస్తోంది.   

ఇదీ చదవండి: గత ఎన్నికల్లో రూ.31 కోట్లు ఖర్చు పెట్టా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement