ప్రొద్దుటూరు రూరల్/ జమ్మలమడుగు: మూడో విడత పంచాయతీ నామినేషన్ల చివరి రోజూ పచ్చ గూండాలు బరితెగించారు. ఎక్కడికక్కడ నామినేషన్ల కేంద్రాల వద్ద రాళ్లు, రాడ్లతో.. కర్రలు..కత్తులతో తిష్ట వేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్ వేయడానికి రావడం ఆలస్యం దాడులు చేసేందుకు కుట్ర పన్నారు. దీంతో పలు మండలాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఒక్క నామినేషనూ వేయలేకపోయారు.
● ప్రొద్దుటూరులో కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన అభ్యర్థులను పోలీసులు నామినేషన్ కేంద్రంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. సహనం కోల్పోయిన అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లాలని ప్రయత్నించిన అభ్యర్థులను రూరల్ సీఐ శివశంకర్ నాయక్, త్రీటౌన్ ఎస్‌ఐ నాగకీర్తనలతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది లాగారు.
● ఎర్రగుంట్ల మండల పరిధిలోని కలమల్ల గ్రామ నామినేషన్ కేంద్రం వద్ద కూటమి గుండాలు కర్రలతో అరాచకం సృష్టించారు. చిన్నదండ్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాచనూరు కవిత నామినేషన్ వేయడానికి వెళ్లగా కలమల్ల నామనేషన్ కేంద్రం వద్ద కూటమి గుండాలు అడ్డుకోని నామినేషన్ పత్రాలను లాక్కోని చించేశారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గుండాలు ట్రాక్టర్‌ను అడ్డం పెట్టి కర్రలు పట్టుకోని దాడి చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు.
టీడీపీ.. బీజేపీ మధ్య ఎన్నికల చిచ్చు
ముద్దనూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారుపై కూటమి పార్టీల మధ్య చిచ్చురేగింది. చిన్నదుద్యాల గ్రామంలో సోమవారం టీడీపీ వర్గీయులు తమ ఇంటికి వచ్చి రాళ్లు, సీసాలు,కర్రలతో దాడిచేసి తమను తీవ్రగా గాయపరిచినట్లు బీజేపీ మద్ధతుదారులైన పాపిరెడ్డి,అతని కుమారుడు శ్రీకాంత్‌రెడిఆవేదన వ్యక్తం చేశారు. వారి టాటా సుమో వాహనాన్ని దగ్ధం చేశారు. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దాడి జరిగిన అనంతరం డీఎస్పీ వెంకటేశ్వరరావు,సీఐ నగేష్‌బాబు గ్రామాన్ని సందర్శించారు.
కలమల్ల నామినేషన్ కేంద్రం వద్ద కర్రలతో కూటమి గూండాలు
టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ పాపిరెడ్డి,


