ఎన్నికల విధులపై మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులపై మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నియమించిన 221 మంది మైక్రో అబ్జర్వర్లకు సోమవారం రెండు విడతలుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పూర్తయింది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ జి. బాలకృష్ణ హాజరై, మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

మదనపల్లి (కురబలకోట): డీఎస్సీ ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ అందించనుందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి పి. తేజస్విని తెలిపారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నిర్వహించే ఈ శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఈడీ, డీఈడీ (టీసీ), ఏపీ టెట్‌ అర్హత కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉన్న అన్నమయ్య జిల్లా బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7989819470, 9912445108 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

ఎయిడ్స్‌డే నిర్వహణపై సమీక్ష

– టార్గెట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

మదనపల్లె టౌన్‌: ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం కార్యక్రమ నిర్వహణపై ముందస్తు ప్రణాళికలో భాగంగా మదనపల్లె జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఉషశ్రీ, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ ఎల్‌.రాధిక, జిల్లా క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఏఆర్టీ, ఐసీటీసీ, ఎస్టీఐ, ఎన్జీవో ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం మిషన్‌ ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమంపై సమీక్షించి, ఇచ్చిన టార్గెట్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఆర్టీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హూమయూన్‌, దిశా ఆనంద్‌, కౌన్సిలర్లు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

ముగిసిన

నామినేషన్ల ప్రక్రియ

మదనపల్లె టౌన్‌: మదనపల్లె డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల మూడో విడత చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసిందని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని 9మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తుండడంతో నామినేషన్‌ కేంద్రాల వద్ద చివరి రోజు డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచి పోలీస్‌ బందోబస్తు పటిష్టపరిచినట్లు తెలిపారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచి, కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి కఠిన ఆంక్షలు అమలు చేశామన్నారు. అభ్యర్థితో పాటు కేవలం మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మూడో విడతలో

4,262 నామినేషన్లు

సాక్షి, మదనపల్లె: మూడో విడతలో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో ఉన్న 156 సర్పంచు, 1640 వార్డు సభ్యుని పదవులకు నామినేషన్లు నిర్వహించారు. వీటిలో సర్పంచు పదవులకు 1,375, వార్డులకు 2,887 కలిపి మొత్తం 4262 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటి పరిశీలన మంగళవారం జరగనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్ల పై అభ్యర్థులు బుధవారం అప్పీలు చేసుకోవచ్చు. గురువారం అధికారులు వాటిని పరిష్కరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement