లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా? | Special Story On Liquor Case Drama Of Chandrababu Govt | Sakshi
Sakshi News home page

లిక్కర్ కేసు అంతా వట్టిదేనా?.. బాబుకు సీను అర్థమైపోయిందా?

Jun 6 2025 4:44 PM | Updated on Jun 6 2025 5:14 PM

Special Story On Liquor Case Drama Of Chandrababu Govt

బెదిరింపుల కోసం అరెస్ట్ డ్రామాలా?

అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్‌ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్‌ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి ఎలాంటి ఆధారాలూ లేవని బాబుకు ఇప్పుడు తెలిసొచ్చిందా ? అందుకే మొన్నటి కేబినెట్ భేటీలో పిల్లిలా సన్నాయినొక్కులు నొక్కారా ? అదే అనిపిస్తోంది. వాస్తవానికివైఎస్‌ జగన్ హయాంలో మద్యం వ్యాపారం మొత్తం బేవరేజెస్ కార్పొరేషన్ చేసింది.. 

లాభమంతా కార్పొరేషన్ కు వస్తుంది.. కార్పొరేషన్ అంటే ప్రభుత్వం .. అంటే సర్కారుకు లిక్కర్ వ్యాపారం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.. పైగా వీధుల్లో ఇష్టానుసారం దుకాణాలు.. అక్రమ బెల్ట్ షాపులు కూడా లేకపోవడంతో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మద్యం ద్వారా భారీ ఆదాయం రావడంతోవైఎస్‌ జగన్ కూడా సంక్షెమ పథకాలు దర్జాగా అమలు చేసారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ కుంభకోసం అనే కాన్సెప్ట్ ను  ప్రజల్లోకి ఎక్కించేందుకు యాతన పడ్డారు. అనుకూల మీడియాలో రకరకాల వార్తలు రాయించారు..

పనిలోపనిగా అప్పటి ఏపీ బీసీఎల్ ఎండీ వసుదేవరెడ్డిని ... రాజ్ కసిరెడ్డిని ఇంకొందరిని అరెస్ట్ చేసి అదేదో పెద్ద కుంభకోణం అన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు తపనపడ్డారు. ఇదే ఊపులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా లీకులు ఇచ్చారు. అయితే ఈ అంశం మీద చంద్రబాబు నిన్న వాస్తవాలు చెప్పేసారు. మొన్న జరిగిన  కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద స్పష్టత ఇచ్చేసారు. "నన్ను స్కిల్ స్కాములోవైఎస్‌ జగన్ సర్కారు అరెస్ట్ చేసింది  కదాని నేను ఆయన్ను లిక్కర్ కుంభకోణంలో ఎలా అరెస్ట్ చేస్తాను.. ఆధారాలు ఉండాలి కదా.. అవి లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజలకు దొరికిపోతాం కదా." అనేసారు.. 

అంటే రాష్ట్రంలో ఆనాడు కుంభకోణమే జరగలేదని చంద్రబాబు అన్యాపదేశంగా కేబినెట్లో ఒప్పేసుకున్నారు. అంటే అది అసలు కుంభకోణమే కాదని.. కేవలంవైఎస్‌ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొదలెట్టిన దుష్ప్రచారం అని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లు కేబినెట్ సహచరులు చెబుతున్నారు. మరి ఏమీ లేనిదానికి ఇలా కుంభకోణం అని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే వచ్చి ఏడాది అయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలుచేయలేని ఈ ప్రభుత్వం ఒక్కో నెల ఒక్కో అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి వారి దృష్టిని మరల్చడానికి చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్లు అర్థం అవుతోంది..
-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement