దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Yellow Media | Sakshi
Sakshi News home page

దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు: సజ్జల

Sep 29 2023 1:41 PM | Updated on Sep 29 2023 4:37 PM

Sajjala Ramakrishna Reddy Comments On Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని, జనం నమ్మక చస్తారా అనేదే ఎల్లో మీడియా ఆలోచన అంటూ దుయ్యబట్టారు.

‘‘వీరంతా తోడు దొంగలే.. ఇంతకంటే పెద్ద పదం లేదు. లక్ష మంది గోబెల్స్‌ కలిస్తే ఒక చంద్రబాబు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ 20 రోజుల్లో లోకేశ్‌ ముఠా నానా యాగీ చేసింది. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన స్కామ్‌పై వీరంతా మాట్లాడటం లేదు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: వామ్మో చినబాబు.. రింగ్‌రోడ్డులో ఎన్ని మలుపులో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement